సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర ధర్మవరం;; రైతులందరూ ఏపీ ఎఫ్ ఆర్ నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని గొట్లూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలకు పంట నమోదు ఈ కేవైసీ చేయించుకొనవలెను అని తెలిపారు.,రైతు సేవా కేంద్ర సిబ్బంది గొట్లూరు చెరువు కింద సాగు చేసిన వరి పంట పొలాలు పరిశీలించడం జరిగింది . వరి పంటలో జంకు లోపం వలన ఆకులు ఎర్రగా మారడం గమనించడం జరిగింది అని, అలాగే ఆకు ముడత, పచ్చ పురుగు ఉధృతి గమనించడం జరిగింది అని తెలిపారు. ప్రస్తుతం వరి పంట పిలక ఆ దశలో ఉన్నది అని, జింకులోప నివారనకు రెండు గ్రాములు జింకు సల్ఫేట్ లీటర్ లీటరు నీటిలో కలిపి మూడు రోజుల వ్యవధిలో రెండు మూడుసార్లు పిచికారి చేయవలసిందిగా సూచించడం జరిగిందన్నారు. అలాగే పచ్చ పురుగు నివారణకు రెండు ఎంఎల్ ప్రొఫినోపోస్ లీడర్ నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణం తయారుచేసుకొని పిచికారి చేయవలసిందిగా రైతులకు సూచించారు. ప్రభుత్వ పథకాలకు ఏపీఎస్ఆర్ తప్పనిసరి అని, రైతు వివరాలు ఏపీ ఏ ఐ ఎం ఎస్ యాప్ నందు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే ఈ రబి సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు అందరూ పంట నమోదు చేసుకొని ఈ కేవైసీ చేయించుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు రైతు సేవా కేంద్ర సిబ్బంది ఆశాజ్యోతి, నాగార్జున పాల్గొన్నారు.
రైతులందరూ ఏపీ ఎఫ్ ఆర్ నమోదు చేసుకోవాలి..
- Advertisement -
RELATED ARTICLES


