Homeజిల్లాలుశ్రీ సత్యసాయినైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి..

నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి..

- Advertisement -

ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం లో స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్, కస్టమర్ కేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ అనే ఉచిత కంప్యూటర్ కోర్సులను మార్చి 2 వ తేదీ నుండి ప్రారంభించబడుతున్నట్లు తెలియజేశారు. దీనికి 10వ తరగతి, ఇంటర్ పాస్, అలాగే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా బి ఎ, బీకాం విద్యార్హత కలిగిన ఆసక్తి గల యువతీ–యువకులు ఫిబ్రవరి 27 లోపు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నమోదు & వివరాల కోసం సెల్ నెంబర్ 91822 88465 లేదా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నేరుగా సంప్రదించవచ్చు అని తెలిపారు. కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు