Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైలులో మహిళ గొలుసు చోరీ

రైలులో మహిళ గొలుసు చోరీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మారం నుండి యాదగిరి వెళ్ళుటకు బందు వర్గములతో కలిసి లాతూర్ ఎక్స్ప్రెస్ ను ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన శారద కుటుంబం రైలులో బయలుదేరింది. రైలు కదులుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి శారదా మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దొంగలించుకుని పారిపోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. లాతూరు ఎక్స్ప్రెస్ కల్లూరు గ్రామానికి చేరే సమయంలో ఎస్-5 లోని 72 బెర్త్ వద్ద ఉన్న శారద వెనుక వైపు నుండి ఒక దొంగ ఈ బంగారు తాళిబట్టను దొంగలించడం జరిగిందని వారు వాపోయారు. ధర్మవరం చేరుకుని రైల్వే పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోవుగా కల్లూరు జిఆర్పి పోలీసు లోనే ఫిర్యాదు చేయాలని తెలుపగా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని జి ఆర్ పి పోలీసులను కోరింది. ఈ నెలలో ఈ రైలులో దొంగతనాలు జరగటం రెండవసారిగా జరిగింది. ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. రైల్వే అధికారులు దొంగతనాలు జరగకుండా మరింత ప్రతిష్టమైన భద్రత నిరంతరం ఉండాలని ప్రయాణికులు వాపోతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు