Homeసినిమాఅటువంటి వాటికి దూరంగా ఉండాలి: జాన్వీ కపూర్

అటువంటి వాటికి దూరంగా ఉండాలి: జాన్వీ కపూర్

- Advertisement -

మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు బాధగా అనిపిస్తుందంటోంది కథానాయిక జాన్వీ కపూర్‌. కొన్నాళ్లుగా ఆమె సోదరుడు అర్జున్‌ కపూర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్‌కి గురవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ దీని గురించి మాట్లాడింది. అలాంటి వేధింపులను క్షమించాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘‘సోషల్‌ మీడియా సంస్కృతి గురించి నేను అర్థం చేసుకున్నదల్లా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ వైరల్‌ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్లు మీ గురించి కంటెంట్‌ సృష్టిస్తుంటే అందులో మీరు కేవలం బలిపశువు మాత్రమే. వారు మీ పేరు ఉపయోగించుకుని వ్యూస్‌లను పొందాలనుకుంటారు. నిజానికి ఆ వార్తలు చదివాక దానికి మీకు ఏ సంబంధం లేదని కూడా మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీరు అలాంటి విషయాలను మనసుకి దగ్గరగా తీసుకోకుండా.. వాటిపై ఎక్కువ సమయం కేటాయించకుండా ఉంటే మంచిది. సోషల్‌ మీడియాలో మరీ ఈ రకమైన ప్రవర్తనను క్షమించకూడదు. ఇలాంటి నెగిటివిటికీ మిమ్మల్ని మీరు ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మేలు్ణ్ణఅని పంచుకుంది. జాన్వీ.. రామ్‌చరణ్‌ సరసన ‘పెద్ది్ణ చిత్రంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు