– 1000 విమానాలు ల్యాండ్ అయిన రికార్డు
విశాఖపట్నం: భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్్ణ మంగళవారం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీని మీద ల్యాండ్ అయిన విమానాల సంఖ్య వెయ్యికి చేరడంతో సరికొత్త రికార్డు సాధించిందని నేవీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ వివేక్ దహియా మాట్లాడుతూ.. నౌక సిబ్బంది బృంద స్ఫూర్తితో ఇన్ని సురక్షిత ల్యాండింగ్‌లు సాధ్యం అయ్యాయన్నారు. దీర్ఘ కాలంగా భారత నావికాదళంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఈ ఘనత సాధించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి కేక్ కోశారు.


