Homeజాతీయంరష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు ట్రంప్ సర్కార్ తాత్కాలిక అనుమతి

రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు ట్రంప్ సర్కార్ తాత్కాలిక అనుమతి

- Advertisement -

న్యూదిల్లీ : పశ్చిమాసియాలు జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు రవాణా పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా మినహాయింపు ఇచ్చింది. ఇదే విషయాన్ని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు. 30 రోజులు పాటు భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్లు బెసంట్ తెలిపారు. దీనితో ప్రపంచ మార్కెట్లోకి చమురు సరఫరా అవుతుందన్నారు. అయితే సముద్రంలో చిక్కుకుపోయి ఉన్న రష్యా నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్లు జరగాలని స్పష్టం చేశారు. ఈ వెసులుబాటుతో కొన్నాళ్లపాటు చమురుపై ఆందోళన చెందనవసరం లేదని భావిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు