Homeజిల్లాలుతూర్పు గోదావరివిద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ వినతిపత్రం

విద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ వినతిపత్రం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ప్రతిరోజూ కడియం నుండి రాజమండ్రి వెళ్లి చదువుకునే విద్యార్థినీ విద్యార్థుల కొరకు ఎపిఎస్ ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కడియం గ్రామానికి చెందిన దొడ్డా దుర్గా చంద్ర రావు (బుజ్జి), చిరుకూరి ప్రభాకర్ లు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల సమయంలో కడియం విద్యార్థులు దేవి చౌక్ సెంటర్ లో బస్సుల కోసం వేచి చూస్తారని, కానీ బస్సులు విపరీతమైన రద్దీతో రావడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్కొక్కసారి బస్సులు ఆపకుండానే వెళ్ళిపోతున్నారని పేర్కొన్నారు. బస్సులు ఆపి విద్యార్థులు ఎక్కినప్పటికీ ఫుట్ పాత్ ప్రయాణం వలన విద్యార్థులు గాయాలు పాలైన సందర్భాలు ఉన్నాయన్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించక ముందే సంబంధిత అధికారులు స్పందించి, కనీసం కాలేజీ సమయాలలో అయినా విద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరినట్లు తెలిపారు. ఈ సమస్య పై సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు