హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 3 మూడవ తేదీ (2025) జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 14 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 14 మంది విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్లు అందుతాయని తెలిపారు. అనంతరం పాఠశాల కమిటీ వారు కూడా కృతజ్ఞతలను తెలియజేశారు.
ఎన్ ఎం ఎస్ పరీక్షలో 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు
- Advertisement -
RELATED ARTICLES


