Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదాన కార్యక్రమం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది

అన్నదాన కార్యక్రమం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వైకే శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదాన కార్యక్రమం యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వై కే శ్రీనివాసులు, మోహన్, గదే రమేష్, సత్రశాల మల్లికార్జున, కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి ఈ కార్యక్రమానికి దాతగా యువర్ ఫౌండేషన్ సభ్యులు వ్యవహరించడం జరిగిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ మాట్లాడుతూ యువర్స్ ఫౌండేషన్ వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు ప్రజలకు వరంలాగా మారాయని తెలుపుతూ ప్రభుత్వ ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుమలత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు