Homeజిల్లాలుఅనకాపల్లిశ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభం

శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభం

- Advertisement -

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా):నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తబయపురెడ్డిపాలెం గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గురూజీ శ్రీమాన్ ఇరగవరపు శ్రీధర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. సందర్భంగా గురూజీ శ్రీమాన్ శ్రీధర్ స్వామి మాట్లాడుతూ శనివారం ఉదయం 9.02నిమిషాలకు ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠా మహోత్సవాలు జరగనున్నాయని, ధ్వజస్తంభం ఎక్కడ ప్రతిష్టిస్తే అక్కడ దేవతలు అందరూ కొలువై స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తే ఆ పరిసర ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. ధ్వజస్తంభం ప్రతిష్ట ఆవశ్యకత వివరించారు . ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా శనివారం మధ్యాహ్నాం 12గంటల నుండి ఆలయం వద్ద భారీ అన్నసంతర్పణ జరుగునని, కావున ఈ ప్రతిష్ఠా మహోత్సవాలను విజయవంతం చేసి స్వామి వారి తీర్ద ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ రేజెటి ఆదిశేషు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుర్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు