కేసు నమోదు చేసిన రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ డ్రైవర్ ఖాజా హుస్సేన్, కండక్టర్ గీతాంజలి పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధర్మారం నుండి అనంతపురం వెళుతూ గుడ్లూరు గ్రామ సమీపంలోకి వెళ్లగానే ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడంతో శవాన్ని మృతుని బంధువులు గ్రామస్తులు రోడ్డులో శవాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నారని డ్రైవర్ కాజా విశాల్ హారన్ కొట్టడంతో, వారు కదలక పోవడంతో మరోసారి హారన్ కొట్టడంతో కోపగించుకున్న మృతుని బంధువులు, గ్రామస్తులు కొంతమంది ఆర్టీసీ బస్సులు అడ్డగించి డ్రైవర్ కాజా హుస్సేన్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా కండక్టర్ గీతాంజలి సెల్లులో వీడియో తీస్తుండటంతో ఆమె పైన కూడా దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను పూర్తిగా పగలగొట్టారు. ప్రయాణికులు ఎంత ప్రయత్నం చేసినా వారి దాడిని ఆపలేకపోయారు. చివరకు కండక్టరు డ్రైవరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవరు కండక్టర్లు మాట్లాడుతూ తమకు దారి ఇవ్వాలన్న తలంపుతోనే హారన్ కొట్టడం జరిగిందని, అంతమాత్రానికే మాపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని, వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ల పైన దాడి చేసిన వారిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేది లేదని చట్ట ప్రకారం శిక్షించాలని డిపో మేనేజర్ తెలిపారు. అనంతరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని ప్రజలకు సేవ చేసే డ్రైవర్లు కండక్టర్లపై దాడులు చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. హారం కొట్టినంత మాత్రాన దాడి చేయడం పద్ధతి కాదని ఒక మహిళా కండక్టర్ పై కూడా దాడి చేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు చేటు చేసుకుంటున్నాయని డ్రైవర్లకు కండక్టర్లకు ప్రభుత్వం మరింత రక్షణ, భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా పోరాటాలను సెల్ఫీ న్యాయం చేసేంతవరకు మా పోరాటాలు ఆపమని వారు మరోసారి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై దాడి
- Advertisement -
RELATED ARTICLES


