Homeజిల్లాలువిజయనగరంప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

- Advertisement -

విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల తలెత్తిన సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. వాటిని బంగార్రాజు స్వీకరించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గ్రామల అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి నీలాపు అప్పల రామిరెడ్డి, టీడీపీ నాయకులు కోరాడ తాతారావు, కంది వెంకటరమణ, ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు