Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపదవ తరగతి పరీక్షల సన్నాహాలను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

పదవ తరగతి పరీక్షల సన్నాహాలను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో పదవ తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16వ తేదీ నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధర్మవరం పట్టణంలోని కొత్తపేట రామ్‌నగర్ ప్రాంతంలో ఉన్న పురపాలక సంఘ బాలికోన్నత పాఠశాల, ఎస్.పి.సి.ఎస్. మున్సిపల్ హై స్కూల్, జి.వి.ఇ. బాలికోన్నత పాఠశాలలను పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఈ పరీక్షా కేంద్రాల్ని ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పాఠశాలల సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా పరీక్షా గదుల్లో సరైన కూర్చునే ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, పరిశుభ్రత, మరుగుదొడ్ల సౌకర్యాలు వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా కళా జ్యోతి సర్కిల్‌లోని జి.వి.ఇ. బాలికోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో హరీష్ బాబు కలిసి భోజనం చేసి వారి పరిస్థితులను, చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధర్మవరం పట్టణానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల హెడ్మాస్టర్లు, పాఠశాల సిబ్బంది, బిజెపి నాయకులు బిల్లే శ్రీనివాసులు, అశ్వత్ నారాయణ, బోయ వేణు, మదన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు