Homeజిల్లాలుతిరుపతిప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి

ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి

- Advertisement -

తిరుపతి ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చే ప్రక్రియ తుది దశలో ఉందని, వీలైనంత వేగంగా స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నూతనంగా ముద్రించిన ప్రెస్ క్లబ్- 2026 డైరీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఘనత ను, ఇప్పటి వరకు సొంత స్థలం లేకపోవడం పై మరొకసారి అధ్యక్ష కార్యదర్శులు మురళి, బాలచంద్ర లు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కు స్థలం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉందని గుర్తు చేశారు. ప్రెస్ క్లబ్ డైరీ ని ఆయన పరిశీలించి ముద్రణ బాగుందని కమిటీని కొనియాడారు. డైరీలను ఆవిష్కరించి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు, జర్నలిస్టులకు అందజేశారు. ఉగాది సందర్భంగా ఆయన జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీలు జగదీష్, విజయ యాదవ్, కార్యవర్గ సభ్యులు నాగార్జున, కోటీశ్వరుడు, జయశంకర్, వరప్రసాదరావు, శీను, చంద్రమోహన్ , కోఆప్షన్ సభ్యులు తులసి, శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు