Homeతెలంగాణకవిత నూతన పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'

కవిత నూతన పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’

- Advertisement -

కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని నమోదు చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనవరి 23న ఆశ్రయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 29ఎ ప్రకారం పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసిన ఆమె, తన అభ్యర్థనపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఈసీఐ తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న జరిగిన విచారణలో కోర్టుకు సమాచారం ఇచ్చారు.

పిటిషన్‌పై గురువారం మరోసారి విచారణ
కవిత సమర్పించిన దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని, వాటిపై ఇప్పటికే ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం పంపినట్లు తెలిపారు. అదే రోజు కవిత తరఫు ప్రధాన న్యాయవాది ఆసుపత్రిలో ఉండటంతో విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీంతో కేసును మార్చి 19కు వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై గురువారం మరోసారి విచారణ జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు