ఎఫఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పియర్సన్
న్యూదిల్లీ: విమానంలో పలు లోపాల కారణంగానే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం సంభవించిందని అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ(ఖీAS) తెలిపింది. గతేడాది జూన్ 12న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విమాన ప్రమాద దర్యాప్తు విభాగం (AAIదీ) దర్యాప్తు చేస్తోంది. కాగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ, జాతీయ రవాణా భద్రతా బోర్డు (చీTSదీ)లపై అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ (ఖీAS) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విమానంలో గత 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. విమానంలో తీవ్రమైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సమస్యలు, పవర్ కంట్రోల్ యూనిట్, ఫ్లైట్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌లో వైఫల్యాలను గుర్తించినట్లు పేర్కొంది. విమానంలో లోపాలకు సంబంధించి బహిర్గతం కాని పలు పత్రాలను తాము సేకరించామని… వాటిని క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ విషయాన్ని వెల్లడించామని ఎఫఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్ పియర్సన్ పేర్కొన్నారు. ఆయా పత్రాలను భారత్‌లోని జాతీయ రవాణా భద్రతా బోర్డు (చీTSదీ), విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIదీ)కు పంపినప్పటికీ వాటి నుంచి తమకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. తాము సేకరించిన వివరాలను ఏఏఐబీ పరిగణలోకి తీసుకుందా, లేదా అనే విషయం తెలుసుకోవడానికి వారికి లేఖ రాసినా ఎటువంటి జవాబు లేదని తెలిపారు. ప్రమాదంపై మరోసారి క్షుణ్ణంగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు.


