Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ఆర్‌ఎస్‌పి 86వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఆర్‌ఎస్‌పి 86వ ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -

ఆర్‌ఎస్‌పి పార్టీ రాష్ట్ర నాయకులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్ఎస్పి రెవలేషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆర్‌ఎస్‌పి 86 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ ఘనంగా నిర్వహించుకున్నారు.అనంతరం ఆర్‌ఎస్‌పి రాష్ట్ర నాయకుడు మంజుల నరేంద్ర మాట్లాడుతూ ప్రజల హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ వస్తున్న రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పి) ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ,ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆర్‌ఎస్‌పి తన పోరాటాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తుందని తెలిపారు.చేనేత కార్మికుల ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రకటించిన చేనేత నేతన్న నేస్తం పథకం కింద ఇవ్వాల్సిన 24,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలి అని, చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది నూలు ధరలు పెరగడం, మార్కెట్ లో సరైన ధరలు రాకపోవడం, మధ్యవర్తుల దోపిడీ వల్ల చేనేత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వారికి జీవనాధారంగా మారుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పడిన తుంపర్తి కాలనీలో పదిహేను వందల మంది నివాసం ఉంటున్నారు అని, ప్రధానంగా కాలనీలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యకు దూరమయేటువంటి పరిస్థితి ఉన్నది అని, చిన్నపిల్లలు విద్యను అభ్యసించడానికి దాదాపుగా ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం వెళ్లి విద్యను అభ్యసించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు. అదేవిధంగా గర్భిణీస్త్రీలు చిన్న పిల్లలుకు ప్రభుత్వం అందించాల్సినటువంటి పౌష్టిక ఆహారానికి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది, కావున ఆ యొక్క కాలనీలో ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రము, ప్రభుత్వ రేషన్ దుకాణం, తాగునీరు , మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ పి పార్టీ జిల్లా నాయకుడు దాసరి నరసింహులు,లోకేష్,లక్ష్మీనారాయణ,నల్లప్ప, ఆదినారాయణ,చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు