పలువురు కళాకారులను సన్మానించిన మంత్రి సవిత, కలెక్టర్, జాయింట్ కలెక్టర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామం వద్ద ఘనంగా ఉగాది వేడుకలు కలెక్టర్ శ్యాం ప్రసాద్, మంత్రి సవిత, జాయింట్ కలెక్టర్ మౌర్యపరద్వాజ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పలువురు జిల్లా అధికారుల నడుమ నిర్వహించారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ, కుమార్తె రామ లాలిత్య నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్, మాజీమంత్రి తదితరులు కళాకారుల బృందాన్ని అభినందించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాలను నాట్య కళా ప్రదర్శనలో నిర్వహించడం గర్వించదగ్గ విషయము అని వారు అభినందించారు. తదుపరి బాబు బాలాజీ మాట్లాడుతూ మాకు ఉగాది పండుగ రోజున ఇటువంటి అవకాశాన్ని ఇవ్వడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు.
ఘనంగా ఉగాది వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


