Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపండక్కి నిరుపేద కుటుంబానికి కొత్త బట్టలు ఆర్థిక సాయం : రజిని ట్రస్ట్

పండక్కి నిరుపేద కుటుంబానికి కొత్త బట్టలు ఆర్థిక సాయం : రజిని ట్రస్ట్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలం పాత కల్లూరు కి చెందిన ఆదిలక్ష్మి వారికి ముగ్గురు కుమార్తెలు వారి కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి బాగాలేదని సోషల్ మీడియా ద్వారా తెలిసిన వెంటనే శ్రీ సత్య సాయి జిల్లా ధర్మారం పట్టణంలోని రజిని ట్రస్టు రక్త బంధం ట్రస్ట్ శ్రీ లక్ష్మీ నరసింహ గ్రామీణ సొసైటీ వారి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రెడ్డి వారి, మిత్రులు,ఆర్థిక సహకారంతో 5000, నగుదు,ఉగాది పండక్కి చిన్నపిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నా వెంకటేష్, మాట్లాడుతూ అది లక్ష్మి,వారి కుటుంబ పరిస్థితి చూసి చాలా బాధగా ఉండడంతో సమాజ శ్రేయస్ కోసం మా మిత్రులు తామ వంతు గా సహకారం 5000 రూపాయలు , కొత్త బట్టలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. సందీప్, మాట్లాడుతూ రక్త బంధం ట్రస్టు, రజిని ట్రస్టు, శ్రీ లక్ష్మీనరసింహ గ్రామీణ సొసైటీ వారి ఆధ్వర్యంలో అనేక సేవలు చాలా అద్భుతంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనేక అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా సంతోషకరం అని తెలిపారు. ఇంకను ఎవరైనా ఆసక్తి గల దాతలు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు
భవిష్యత్తులో పిల్లలకు మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో,కేతా లోకేష్,కన్నా వెంకటేష్, సందీప్, సదా, మహిళా టీం సభ్యులు శ్రీలత, హేమలత,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు