-గురువు మానస
విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో ఉగాది పండుగ సందర్భంగా సాయి ఆరామం లో ఉగాది పురస్కార వేడుకలు జౌళి శాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఎస్పీ తో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారిచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శన పట్ల ముఖ్య అతిథులు ముగ్దులై మానస నిర్వహించిన నాట్యం పట్ల వారు అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి చేతులమీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం గురువు మానస మాట్లాడుతూ ఇటువంటి అవకాశం జిల్లాలో కల్పించినందున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ధర్మారం పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా మానస నృత్య కళా కేంద్రం వారి శిష్య బృందం మొత్తం 15 మంది చే ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ నృత్య ప్రదర్శన పట్ల ఆలయ కమిటీ వారు కూడా ఎంతో ఆసక్తిగా తిలకించి, వారికి అభినందనలు తెలుపుతూ, వారి పేరిటన పూజలు నిర్వహించి, ప్రశంసా పత్రాలను అందజేస్తూ ఘనంగా సత్కరించారు. ఈ ఉగాది పండుగ నాడు మా నిత్య ప్రదర్శన ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని మానస తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న మానస నృత్య కళా కేంద్రం నాట్య ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


