Homeఅంతర్జాతీయంఅమెరికాతో చర్చలు జరపడం అనేది ఇక ‘‘ముగిసిపోయిన అధ్యాయం‘‘

అమెరికాతో చర్చలు జరపడం అనేది ఇక ‘‘ముగిసిపోయిన అధ్యాయం‘‘

- Advertisement -

స్పష్టం చేసిన ఇరాన్

అమెరికాతో చర్చలు జరపడం అనేది ఇక ‘‘ముగిసిపోయిన అధ్యాయం ‘‘ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తేల్చి చెప్పారు. గతంలో వాషింగ్టన్‌తో జరిపిన చర్చలు తమకు కేవలం విశ్వాసఘాతుకం, చేదు అనుభవాన్ని మాత్రమే మిగిల్చాయని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇకపై అమెరికాతో ఎలాంటి రాయబారాలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.గతంలో కుదిరిన అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడాన్ని ప్రస్తావిస్తూ అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాటపై నిలబడే నైజం అమెరికాకు లేదని, కేవలం మోసపూరిత ధోరణి ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న 48 గంటల గడువులు, అల్టిమేటం వంటి బెదిరింపులకు ఇరాన్ లొంగిపోదని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధమని హెచ్చరించారు.దౌత్యపరమైన మార్గాలు మూసుకుపోయాయని ఇరాన్ ప్రకటించడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దారితీయవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రపంచ రాజకీయాలపై, ముఖ్యంగా చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు