Homeజిల్లాలుతూర్పు గోదావరినర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు

నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని పలువురు నర్సరీ రంగ పెద్దలు పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నందు, అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, కాటన్ దొర 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. ఇటీవల కడియం మండల స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్దులను సత్కరించారు. ప్రథమ స్థానంలో జేగురుపాడు జివికె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెతకుల చంద్ర శేఖర్, ద్వితీయ స్థానంలో పేరూరు గంగాధర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన అల్లంపల్లి భార్గవి, తృతీయ స్థానంలో వీరవరం బిఎస్ఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కందుకూరి సంధ్య లను మెమెంటో, శాలువా, ప్రైజ్ మనీ లతో సత్కరించారు. ఈకార్యక్రమంలో కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు, పటంశెట్టి చిన్న మహాలక్ష్మి నాయుడు, తిరుమల శెట్టి భాస్కరరావు, మార్గాని ఏడుకొండలు, గట్టి సుబ్బారావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప, బోడపాటి గోపాలకృష్ణ, కొండేపూడి నాగు, తడల నాగేశ్వరావు, గాజుల రతయ్య, రత్నం బాబ్జి, పిల్లా శ్రీనివాస్, బోడపాటి సత్యనారాయణ, మల్లు శివనారాయణ, గాదా నాగేశ్వరావు, క్రొవ్విడి వాసు, బత్తుల రాము, గట్టి నరసయ్య, ఆదిమూలం సాయిబాబా, బోర్సు సుబ్రమణ్యం, పాఠంశెట్టి సుబ్బారావు, తూము శ్రీను, గుద్దటి చిన్న సత్యనారాయణ, కర్రి యేసయ్య, ఈలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు