అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
దాడి చేస్తే దీటుగా జవాబు: ఇరాన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్ప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు. నియంతత్వమో, ఆకతాయితనమో తెలియదు. యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మరుసటిరోజే ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 48 గంటల్లోగా ీVAర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ీVAర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్‌కు ఇది సరైన సమయం అని తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. తెహ్రాన్‌కు మంగళవారం ఉదయం వరకు సమయం ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఇరాన్ తమ హెచ్చరికలను పట్టించుకోకుండా 48 గంటల్లో ీVAర్మూజ్‌ను తెరవకపోతే ఆ దేశంలోని పెద్దదైన విద్యుత్తు ప్లాంట్‌ను తుడిచిపెడతామని హెచ్చరించారు. ట్రంప్ నిర్ణయాలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత అయ్యేట్టుగా ఉన్నాయి. మరో వైపు మేం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గమని ఇరాన్ తెగేసి చెపుతోంది. ఇరాన్ బలాన్ని అగ్ర రాజ్యం సరైన రీతిలో అంచనా వేయలేకపోయిందని ఇప్పటికే అనేక కథనాలు వస్తున్నాయి. ఇరాన్ మూడు వారాలు పాటు ఎదురొడ్డి నిలబడిందంటేనే అర్ధమవుతోంది. అగ్ర రాజ్యం ఆంక్షలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గడం లేదు. మా పవర్ ప్లాంట్ జోలికి వస్తే దీటుగా జవాబు చెపుతామని ఇరాన్ పేర్కొంది.


