Homeసినిమామే1న థియేటర్లలో ‘గాయపడ్డ సింహం’

మే1న థియేటర్లలో ‘గాయపడ్డ సింహం’

- Advertisement -

హైదరాబాద్: కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌తో ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. కాగా ఈ చిత్రాన్ని మే 1, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన మరుసటి రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నైజాం, ఆంధ్రప్రదేశ్ పంపిణీ బాధ్యతలను చేపట్టడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మానస చౌదరి, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు