Homeఅంతర్జాతీయంహోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్‌’

హోర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై భారీగా ‘టోల్‌’

- Advertisement -

ఇరాన్ నిర్ణయం!
తెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్‌తో కొనసాగుతున్న ఘర్షణల నడుమ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలకు కీలకమైన హోర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకలపై భారీగా టోల్ వసూలు చేయాలని నిర్ణయించి నట్లు సమాచారం. ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.18 కోట్ల వరకు పన్ను విధించనున్నట్లు ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత కమిటీ సభ్యుడు అలాఎద్దీన్ బొరూజెర్దీ వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి చెప్పారు. హోర్మూజ్ జలసంధిలో కొత్త విధానం అమల్లోకి వచ్చిందని, ఇది దేశ సార్వభౌమాధికారానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతున్నందున, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ఈ చర్య అవసరమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్పు తీసుకువచ్చామని ఆయన తెలిపారు. ప్రస్తుతం హోర్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. గల్ఫ్ ప్రాంతం నుంచి వెలువడే చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు