పుట్టపర్తి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంద్ర ధర్మవరం;;శ్రీసత్యసాయి జిల్లా సిపిఐ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం అనంతపురంలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కాటమయ్య అధ్యక్ష వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్, జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీరం చేస్తుంది. గతంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతము నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలతో పనులు కల్పించేవారు కానీ బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వి బి జి రాంజీ పథకం పేరుతో పథకం చేసి 40 శాతము నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని, కేంద్రం ప్రభుత్వం 60 శాతము ఇస్తుందని తెలుపుతూ ఈపథకాన్ని ఇచ్చినా కూడా, ఆ పథకాన్ని నీరుగారుస్తూ కూలీలకు పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని మండిపడ్డారు. అందువల్ల వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కొనసాగించాలని ఏప్రిల్ 10, 11 ,12 తేదీల యందు వెయ్యి మందితో పాదయాత్ర చేసి 12వ తేదీన బండ్లపల్లి గ్రామంలో బహిరంగ సభ జరపాలని జిల్లా కార్యవర్గం నిర్ణయించబడింది అని తెలిపారు. ఈ బహిరంగ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా , జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ , వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ,జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ముసుకు మధు, ఆంజనేయులు, జింక చలపతి, దాదాపీర్, హిందూపూర్ వినోద్ , మహదేవ్, కదిరెప్ప, ఆనంద్ బాబు, పుట్టపర్తి వినోద్, చలపతి, వెంకటేష్, సకలరాజా, కాటమయ్య, వెంకటేశు రామకృష్ణ ,రవికుమార్, రమణ, రమీజా, తదితరులు పాల్గొన్నారు.
మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని హక్కుగా పరిగణించాలి
- Advertisement -
RELATED ARTICLES


