జిల్లా పశు గనాభివృద్ధి అధికారి వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రావులచెరువు గ్రామం లో జిల్లా పశుగానబీవృధి సంస్థ వారి ఆధ్వర్యంలో లేగ దూడల(పెయ్యా దూడలు) ప్రదర్శన నిర్వహించడం జరిగిందని జిల్లా వాసు గణాభివృద్ధి అధికారి వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా సుమారు 37 దూడలు ఈ శిబిరమునకు పాడి రైతులు తీస్కొని రావడం జరిగింది అని తెలిపారు.వచ్చినట్వాంటి లేగ దూడలకు నట్టల నివారణ తాగించి, ప్రతి దూడకు ఖనిజ లవన మీశ్రమ బ్లాకలను, కాల్షియం టానిక్ లను ఉచితంగా అందచేయటం జరిగింది అన్నారు. అంతే కాక పాల్గొనినా ప్రతి ఒక్క రైతుకు ప్రోత్సాహక బహుమతులు అందచేయటం జరిగింది అని తెలిపారు. దీనిలో మొదట విజేత గా జి. రమణరెడ్డి ఆవు దూడ, రెండవ విజేతగా వెంకట రాముడు ఆవు దూడ, మూడవ విజేత గా బి. వీరనారప్ప లేగ దూడలకు ప్రోత్సహక బహుమతులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి పద్మాలత , చింతలపల్లి పశువైద్యదికారి శేఖర్, డాక్టర్. శ్రీకాంత్, గ్రామ నాయకులు చెన్నా రెడ్డి, మాధవ రెడ్డి, గ్రామ పాడి రైతులు, పశు వైద్య సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమంను విజేయవంతం చేశారు.
లేగ దూడల ప్రదర్శన ..
- Advertisement -
RELATED ARTICLES


