నా దేశం – నా బాధ్యత పేరుతో ఏపీలో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం
బంగారం కొనుగోళ్లు తగ్గించి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి
రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పిలుపు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన పొదుపు చర్యలపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలోనే వారికి ఒక రోజు నో వెహికల్ డేను పాటించాలని నిర్ణయించారు. వాహనాలు కాకుండా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టిపెట్టాలని నిర్ణంయ తీసుకున్నారు. ‘నాదేశం – నా బాధ్యత’ పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు కూడా రద్దు చేశారు.
మంత్రులు ప్రజా రవాణాలో కానీ, ఈవీ వెహికల్, సైకిల్‌ను వినియోగించాలని నిర్ణయించింది. జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని తీర్మానం చేశారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని, సోలార్ ఎనర్జీనే ఎక్కువ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రమే తమ కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని.. ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టిసారించాలన్నారు. సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు. దేశం మనకెంతో ఇచ్చిందని.. దానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చిందని అన్నారు. ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
అయితే, పొదుపు చర్యలని ఒకేసారి చెబితే ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించగా.. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. రెండు రోజుల ప్రజలకు అన్ని పొదుపు చర్యలు వివరిద్దామని చంద్రబాబు చెబితే.. అలానే చేద్దామని మిగతా మంత్రులు అన్నారు. అలాాగే, ఈ క్యాబినెట్‌లో పలు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు విమానాశ్రయం పీపీపీ విధానంలో అభివృద్ధిపై చర్చించారు. వివిధ కంపెనీలకు భూ కేటాయింపులపై కూడా ఆమోదం తెలిపారు.


