Homeఅంతర్జాతీయంఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

- Advertisement -

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్‌ నుంచి భారత్‌కు వంటగ్యాస్‌ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. దీంతో ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర వాణిజ్యమార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో ఇంధనరవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఖతార్‌లోని రాస్ లఫాన్ నౌకాశ్రయం నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వంటగ్యాస్‌ను తరలిస్తున్న ఃసిమిః నౌక గురువారం ఒమన్ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ప్రయాణసమయంలో ఈనౌక తన సంకేత వ్యవస్థను కొంతసేపు నిలిపివేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అలాగే యూఏఈలోని రువాయిస్ శుద్ధికేంద్రం నుంచి బయలుదేరినఃఎన్వీ సన్‌షైన్ః నౌక కూడా హర్మూజ్ జలసంధిని దాటిన అనంతరం తన సంకేతాలను నిలిపివేసింది.

ఈ మార్గంలో ఇంధన సరఫరా క్రమంగా పునరుద్ధరణ
ఈ నౌక కర్ణాటకలోని మంగళూరు దిశగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఇక ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించిన ప్రయత్నాలు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్ నుంచి వచ్చిన స్పందన పూర్తిగా ఆమోదయోగ్యంగా లేదని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ఃట్రూత్ సోషల్ఃలో పేర్కొన్నారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ తమ అభిప్రాయాన్ని అమెరికాకు పంపినట్లు సమాచారం. ప్రపంచ ముడిచమురు,ఎల్‌ఎన్‌జీ రవాణాలో భారీ భాగం హర్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. భారత్‌కు అవసరమైన ఇంధన దిగుమతుల్లో కూడా ఈ మార్గం అత్యంత కీలకంగా భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు