అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం
వాషింగ్టన్: పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేమని అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పాక్ ద్వంద్వ వైఖిరిని ఆయన తీవ్రంగా ఖండించారు. పశ్చిమాసియా ఉద్రిక్తితల నేపథ్యంలో అమెరికాఇరాన్ శాంతి ఒప్పందం కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇరాన్‌కు పాక్ సైనికంగా సహకరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే లిండ్సే స్పందన ఈ విధంగా రావడం గమనార్హం. ‘నేను పాకిస్థాన్‌ను ఏమాత్రం నమ్మలేను. ఆ దేశాన్ని వీలైనంత దూరంగా ఉంచుతాను. ఇరాన్ విమానాల పార్కింగ్‌కు పాక్ అనుమతిస్తే...మధ్యవర్తిత్వానికి అమెరికా వేరొక దేశాన్ని వెతుక్కోవాలి. అందుకేమో శాంతి ఒప్పందం అంశం ఎటూ తేలడం లేదు’ అని లిండ్సే అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా దాడుల భయంతో ఇరాన్ వైమానిక దళానికి చెందిన కొన్ని యుద్ధ విమానాలను పాకిస్థాన్‌లోని స్థావరాలకు తరలించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిందే. గూఢచర్య నిఘా కార్యకలాపాలకు వినియోగించే ప్రత్యేక ఆర్సీ130 విమానం కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే…ఈ కథనాలకు పాకిస్థాన్ అధికారులు తోసిపుచ్చారు. తమ ఎయిర్‌వేస్‌లలో ఇరాన్ సైనిక విమానాలకు ఆశ్రయం ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పాక్ సైనికాధికారి ఒకరు కొట్టిపారేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాక్‌కు అనుకూలంగా మాట్లాడారు. తమ దేశం మరో మధ్యవర్తిని వెతకడం లేదని తేల్చి చెప్పారు.


