–ఎంపీడీఓ బి.విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలో గ్రామీణ పేదల అభ్యున్నతికి తన వంతు చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలవడం హర్షనీయమని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి కొనియాడారు. పీ4-పేదరిక నిర్మూలన మార్గదర్శకుడు, చేతన్ కన్స్ట్రక్షన్స్ ఎండి, టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీని బుధవారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో శాలువా, మొమెంటోతో ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సేవా కార్యక్రమాలకు చిరునామాగా ఉన్నారనారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, గత మూడేళ్లుగా పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్, రామగిరి మండలం నసనకోట ఎంజేపీ విద్యార్థులకు ఏటా రూ. 60,000 ఆర్థిక సాయం అందిస్తూ విద్యాప్రదాతగా నిలుస్తున్నారన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల తగ్గింపునకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప దాతల సహకారంతో గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ, పెసరకుంటలో స్వయంగా రూ.లక్ష వ్యయంతో ప్లాంట్ నిర్మించి ప్రజల దాహార్తిని తీర్చారన్నారు. బుక్కచెర్ల
నల్లలమ్మ దేవాలయం, బొమ్మేపర్తి పెద్దమ్మ దేవాలయాల అభివృద్ధికి రూ.లక్ష చొప్పున విరాళం అందించడంతో పాటు, పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. పేద కుటుంబాల్లో అంత్యక్రియల కోసం ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న సేవలు అందరికీ అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, సర్పంచ్ సాకే తిరుపాలు, పంపు దుబ్బ నారాయణ, రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు, అచ్యుతానందబాబు, ఏఓ భానురేఖ, ఏపీఓ సావిత్రి, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


