కరెస్పాండెంట్ నిర్మలాదేవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ నిర్మలాదేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ తరగతి నుండి ప్రైమరీ తరగతుల వరకు నిర్వహించామని తెలిపారు. తదుపరి ఫ్రీ ప్రైమరీ తరగతులలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రసంగాలు, ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శెట్టిపి సూర్య ప్రకాశ్ రెడ్డి ,పద్మ, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


