సబ్ రిజిస్టర్ తాయన్న
విశాలాంధ్ర ధర్మవరం; సమాచార హక్కు చట్టంపై అవగాహన ఎంతో అవసరమని సబ్ రిజిస్టర్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును, స్లాట్ బుకింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ స్లాట్ బుకింగ్ పై అవగాహన చేసుకుని మంచి ఫలితాలను అందించాలని తెలిపారు. డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టం స్లాట్ బుకింగ్ మార్చి మూడవ తేదీ 2025న ప్రారంభించడం జరిగిందని వారు గుర్తు చేశారు. స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి? అన్ని విషయాలు కూడా వారు వివరించారు. ప్రజలకు లాభాలు చేకూర్చే విధంగా మన విధులు ఉండాలని, దీని ద్వారా వెయిటింగ్ సమయం తగ్గుతుందని, సౌకర్యవంతమైన ప్రణాళిక కూడా వస్తుందని, పారదర్శకతో కూడిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయపాలనతో క్రమబద్ధమైనదిగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ గంగాధర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టంపై అవగాహన ఎంతో అవసరం..
- Advertisement -
RELATED ARTICLES


