Homeసినిమామరో అవకాశం ఇవ్వండి సార్

మరో అవకాశం ఇవ్వండి సార్

- Advertisement -

రామ్‌చరణ్‌కు బుచ్చిబాబు అభ్యర్ధన
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా 30న విడుదల కానుంది. ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ఇప్ప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా రామ్‌చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రామ్‌చరణ్ ఫొటోను బ్యానర్ ఐటమ్‌గా ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చరణ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో చరణ్ స్టైలిష్ లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి దర్శకుడు బుచ్చిబాబు చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘సర్…మరో అవకాశం ఇవ్వండి’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఇప్ప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ‘పెద్ది’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని వార్తలు మొదలయ్యాయి. గ్యాంగ్‌స్టర్ సినిమా తీయమంటూ కొంత మంది అభిమానులు రిప్లైలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ పెద్ది సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకూ విడుదలైన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీనితో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు