Wednesday, January 8, 2025
Homeజిల్లాలుఅనంతపురంహంద్రీనీవా లైనింగ్ పనులు నిలిపివేయాలి రైతుల పక్షాన పోరాడుతాం…

హంద్రీనీవా లైనింగ్ పనులు నిలిపివేయాలి రైతుల పక్షాన పోరాడుతాం…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి జగదీష్

విశాలాంధ్ర-అనంతపురం : హంద్రీనీవా సెకండ్ ఫేస్ పనుల్లో భాగంగా కాంక్రీట్ ద్వారా లైనింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద హంద్రీనీవా కాలువకు చేపట్టిన లైనింగ్ పనులు నిలుపువేయాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ మాట్లాడుతూ… రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైతే అతి తక్కువ వర్షపాతం వస్తుందో ఆ జిల్లాల్లో కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా మరలించాలని తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని శివరామకృష్ణ నివేదిక ప్రకారం ఎన్టీఆర్ ప్రారంభించడం జరిగిందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిధులు కేటాయించి హంద్రీనీవా కాలువను త్రవించడం జరిగిందన్నారు. తద్వారా 40 టీఎంసీల నీటిని పెంచడం జరిగిందన్నారు. దీనిని చంద్రబాబు నాయుడు వెడల్పు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. త్రాగునీరు సాగునీరు కృష్ణాజిల్లాల ద్వారా మళ్లించడం వలన చాలా మంచి పని జరిగిందన్నారు. లక్షలాది ఎకరాల భూములు సాగు సాగు చేయడానికి భూగర్భ జలాల ద్వారా బోరు బావులు రీఛార్జ్ అయిందన్నారు. ప్రస్తుతం హంద్రీనీవా కాలువను వెడల్పు చేయకుండా సెకండ్ ఫేస్ పనుల్లో కాంక్రీట్ ద్వారా లైనింగ్ పనులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. లైనింగ్ పనుల ద్వారా కాంక్రీట్ పనులు చేయడం వలన భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల బోరు బావులు కూడా రీఛార్జ్ కావన్నారు. ఏ ఉద్దేశంతో హంద్రీనీవా నిర్మించబడిందో ఆ ఉద్దేశం దెబ్బతింటుందన్నారు. హెచ్ ఎల్ సి కెనాల్ కు లైనింగ్ వేయాలని తద్వారా 32 టీఎంసీల నీటిని తుంగభద్ర నుంచి అందించాలని రైతు సంఘాలు,రాజకీయ పార్టీ అడుగుతుంటే అక్కడ లైనింగ్ వేయలేదన్నారు. హంద్రీనీవాకు సెకండ్ ప్లేస్ లో లైనింగ్ వెయ్యకుండా కాలువ వెడల్పు చేయాలని కోరడం జరిగిందన్నారు. లైనింగ్ పనులు వేయకుండా ఇంజనీర్లు పునరాలోచించుకొని ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో దానిని అడ్డగించే దానికి రైతులు, రైతు సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ… అనంతపురం జిల్లాకు త్రాగునీరు సాగునీరు కల్పించాలని పోరాటం చేయడం వలనే హంద్రీనీవా ద్వారా అనంత జిల్లాకు వస్తున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం హంద్రీనీవా ద్వారా ఎక్కువశాతం నీటిని తీసుకొని వస్తామని పదివేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు జీవో నెంబర్ 405 ద్వారా హంద్రీనీవా లైనింగ్ చేయడానికి ప్రతిపాదన తీసుకొని రావడం దీనికోసం 950 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. లైనింగ్ చేస్తే అంత జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా హంద్రీనీవా కాల్వని వెడల్పు చేసి పదివేల క్యూసెక్కుల నీరు అందించిన తర్వాతే తదుపరి చర్యలకు పోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ… హంద్రీనీవా కాలువ ద్వారా నీరు సెకండ్ ఫేస్ లైనింగ్ ద్వారా జీడిపల్లి నుంచి కుప్పం వరకు మీరు అందించడానికి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. గత మాసంలో లైనింగ్ పనులకు వ్యతిరేకంగా రాప్తాడు ఎమ్మెల్యే, హెచ్.ఎల్.సి ఎస్సీ, జిల్లా కలెక్టర్లకు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లైనింగ్ పనులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి, నరేంద్ర, విజయ్, రూరల్ మండల సిపిఐ కార్యదర్శి రమేష్, సహకార దర్శి నరేష్, రైతు సంఘం నాయకులు చలపతి, వెంకట రాముడు, కుళ్లాయి స్వామి, రెడ్డప్ప, నారాయణస్వామి, దుర్గాప్రసాద్, రాజు, మహేష్, ఆత్మకూరు మండల కార్యదర్శి నీళ్లపాళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు