Homeఆంధ్రప్రదేశ్అలుపెరగని పోరాట ప్రస్థానం ఏఐటియుసి సొంతం

అలుపెరగని పోరాట ప్రస్థానం ఏఐటియుసి సొంతం

- Advertisement -

ఏడు దశాబ్దాలుగా విజయవంతంగా మహాసభలు

ఇది మీకు తెలుసా…?
*ఏఐటీయూసీ పోరాట ప్రస్థానం

                              (విశాలాంధ్ర – తిరుపతి)

కార్మిక లోకపు అగ్రగామి సంస్థ ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు 18వ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు, కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిర్వహించిన మహాసభలు ఆయా కాలాల్లో కీలక నిర్ణయాలకు వేదికయ్యాయి. తొలి మహాసభ కొత్తగూడెంలో ప్రారంభం కాగా, ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజనానంతరం నూతన ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత 17 మహాసభల సమగ్ర వివరాలు మీకోసం…

మహాసభల వివరాలు… ఎన్నికైన కమిటీలు

తేదీ -  ప్రదేశం -  అధ్యక్షులు -  ప్రధాన కార్యదర్శి  

*16-18 నవంబర్ 1956-   కొత్తగూడెం-   మగ్దూం మోహిద్దీన్ -  కె.ఎల్. నరసింహారావు  
*8-10 మే 1959 -  గుంటూరు -  మగ్దూం మోహిద్దీన్ -  కె.ఎల్. నరసింహారావు  
*9-10 జూన్ 1963 -  హైదరాబాద్ -  కె.ఎల్. నరసింహారావు  - ఎన్. సత్యనారాయణరెడ్డి  
*14-17 ఏప్రిల్ 1966 -  విశాఖపట్నం -  కె.ఎల్. నరసింహారావు -  ఎన్. సత్యనారాయణరెడ్డి  
*12-14 మే 1973 -  హైదరాబాద్ -  డా॥ రాజ్ బహదూర్ గౌడ్ -  ఎం.వి.ఎన్. కపర్థి  
*4-7 అక్టోబర్ 1978 -  గోదావరి ఖని -  డా॥ రాజ్ బహదూర్ గౌడ్ -  ఎం.వి.ఎన్. కపర్థి  
*13-15 జూన్ 1982-   హైదరాబాద్ -  ఎం. వీరభద్రం-   కె.ఎల్. మహేంద్ర  
*17-19 మే 1985-   రాజమండ్రి -  వై. విజయకుమార్ -  కె.ఎల్. మహేంద్ర  
*16-18 జూలై 1989 -  తిరుపతి -  వై. విజయకుమార్  - పొట్లూరి నాగేశ్వరరావు  
*25-27 ఫిబ్రవరి 1994 -  విశాఖపట్నం  - వై. విజయకుమార్ -  పొట్లూరి నాగేశ్వరరావు  
*28 ఫిబ్రవరి, 1-2 మార్చి 1999 -  గుంటూరు  - వి.వి. రామారావు -  పొట్లూరి నాగేశ్వరరావు  
*18-20 నవంబర్ 2004 -  రాజమండ్రి -  వి.వి. రామారావు -  పి.జె. చంద్రశేఖరరావు  
*15-16 ఫిబ్రవరి 2006 -  గుంతకల్   –   –   పీ. నాగేశ్వరరావు (కార్యనిర్వాహక అధ్యక్షులు)
*16-18 నవంబర్ 2008-   ఒంగోలు -  వి.వి. రామారావు -  పి.జె. చంద్రశేఖరరావు -  టి. లక్ష్మీనారాయణ (కార్య. అధ్యక్షులు)
*15-17 నవంబర్ 2011-   హైదరాబాద్-   పి.జె. చంద్రశేఖరరావు -  జి. ఓబులేసు -  వి.వి. రామారావు (గౌరవాధ్యక్షులు)
*28 జూన్ 2014  - హైదరాబాద్  - పి.జె. చంద్రశేఖరరావు -  జి. ఓబులేసు   ఏపీ నూతన నాయకత్వం ఎన్నిక
*27-29 డిసెంబరు 2014 -  తిరుపతి -  చలసాని వెంకట రామారావు -  జి. ఓబులేసు  
*22-24 నవంబర్ 2018 -  కర్నూలు-  రావులపల్లి రవీంద్రనాథ్ -  జి. ఓబులేసు  
*31 అక్టోబర్ – 2 నవంబర్ 2022 -  గుంటూరు -  రావులపల్లి రవీంద్రనాథ్ -  జి. ఓబులేసు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు