Homeసినిమాచందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ

చందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ

- Advertisement -

సినిమా: ప్రముఖ హిందీ హీరో అక్షయకుమార్, తెలుగు నటుడు రానా దగ్గుబాటి కథానాయకులుగా మరొక మల్టీస్టారర్ సినిమాకి రంగం సిద్ధమైంది. హిందీ, తెలుగు హీరోల కలయికగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనుంది. మరొక అగ్ర తార ఇందులో నటించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని నేపథ్యంలో కథని సిద్ధం చేశారు చందు. హిస్టారికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని భారీ హంగులతో కరణ్‌జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. భక్తి, చరిత్ర, థ్రిల్లింగ్ అంశాలతో ముడిపడిన కథల్ని తెరకెక్కించడంలో సిద్ధహస్తులు చందు మొండేటి. ఆయన ఇదివరకు తెరకెక్కించిన ‘కార్తికేయ’, ప్రేమమ్, కార్తికేయ 2, తండేల్ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసారి మరింత భారీగా సినిమాని రూపొందించనున్నట్టు తెలుస్తోంది. విజయంతమైన ‘తండేల’ తర్వాత చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. భారతీయ ఇతిహాస, ఇతివత్తాలకు తన కథల్లో ప్రాధాన్యత కల్పిస్తూ ఒక ట్రెండ్‌ను సష్టించారు చందు. అదే తరహా పురాణ ఇతిహాసానికి థ్రిల్లర్‌ను జోడించి ఒక భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు