Homeజిల్లాలుశ్రీ సత్యసాయినియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఇంచార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి

నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఇంచార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో గల ఓటర్ల జాబితాను ఇన్చార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21/4/2026 నాటికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పురుషులు 1,22,706 మంది, స్త్రీలు 1,25,285 మంది, ఇతరులు 21 మంది కలిసి మొత్తం 2,48,012 ఓటర్లు కలరు అని తెలిపారు. ధర్మవరం అర్బన్ లో పురుషులు 52, 386 మంది, స్త్రీలు 54, 049, ఇతరులు 13 కలిపి మొత్తం 1,06,448 మంది కలరని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం రూరల్ లో పురుషులు 17,320, స్త్రీలు 17,505 ఇతరులు 2 కలిపి 34, 827 మంది ఓటర్లు కలరు అని తెలిపారు. బత్తలపల్లి లో పురుషులు 16,139 మంది ఓటర్లు, స్త్రీలు 16,562 మొత్తం 32, 704 మంది ఓటర్లు కలరని తెలిపారు. ముదిగుబ్బ మండలంలో పురుషులు 23,925 మంది ఓటర్లు, స్త్రీలు 24, 320, ఇతరులు2, కలిపి 48, 247 మంది కాలరని తెలిపారు. అదేవిధంగా తాడిమర్రి మండలంలో పురుషులు 12,936 మంది, స్త్రీలు12,849, ఇతరులు 01, కలిపి 25,786 మంది ఓటర్లు కలరు అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు