Homeఅంతర్జాతీయంమొజ్తాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ?

మొజ్తాబా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ?

- Advertisement -

తెహ్రాన్: ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖామేనీ ఆరోగ్యంపై ఈ మధ్య అనేక ఊహాగానాలు, కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు మొజ్తాబా ఉన్నారో లేదో అని ప్రకటనలు చేశారు. మొజ్తాబా ఖామేనీ ఆరోగ్యానికి సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా- ఇజ్రాయెల్ తొలిరోజు జరిపిన దాడుల్లో ఖామేనీ కాలికి గాయం కావడంతో పాటు ఆయన ముఖం కూడా కాలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలున్నట్లు ఇరాన్ సీనియర్ అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘ఖామేనీ బతికే ఉన్నారు. స్పృహలోనే చురుకుగా ఉన్నారు. అయితే, దాడుల్లో కాలికి దెబ్బ తగలడంతో దానికి మూడుసార్లు ఆపరేషన్ జరిగింది. కృత్రిమ కాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన చేతికి శస్త్రచికిత్స జరిగింది. ఇప్ప్పుడు అది నయమైంది. దాడుల్లో ఖామేనీ ముఖం, పెదవులు కూడా తీవ్రంగా కాలిపోవడంతో. ఆయన మాట్లాడటం కూడా కష్టంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయి’ అని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఖామేనీని రహస్య ప్రాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కూడా ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయనకు ఏదైనా సమాచారం చేరవేసేందుకు చేతితో రాసిన ఉత్తరాలను మాత్రమే వాడుతున్నారని అవి తెలిపాయి. ఆ ఉత్తరాలను ఖామేనీ ఉన్న రహస్య ప్రాంతానికి మోటార్‌సైకిళ్లపై చేరవేస్తున్నట్లు వెల్లడించాయి. ఆయన సమాధానాలు అలాగే తిరిగి వస్తున్నాయని పేర్కొన్నాయి. కాగా.. ఇజ్రాయెల్ నిఘాకు దొరకకుండా ఉండటం కోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా ఖామేనీని కలిసేందుకు వెళ్లడం లేదని తెలుస్తోంది. కాగా…దేశాన్ని నడిపేందుకు మొజ్తాబా ఓ బోర్డును ఏర్పాటుచేసినట్లు ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనేజాద్‌కు సన్నిహితుడైన రాజకీయవేత్త అబ్దుల్‌రెజా దవారీ పేర్కొన్నారు. ఈ బోర్డుకి ఖామేనీ డైరెక్టర్‌గా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ జనరల్స్ సభ్యులుగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. వారి సలహాలు, మార్గదర్శకాల పైనే ఖామేనీ ఎక్కువగా ఆధారపడుతున్నారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు