Homeఅభివృద్ధి పరుగులు

అభివృద్ధి పరుగులు

- Advertisement -

. రోజుకో ఎంఓయÖ… వారానికో శంకుస్థాపన
. మెరుగైన పాలన నినాదం కాదు… ఆచరణ కావాలి
. వేగవంతమైన అభివృద్ధికి కలెక్టర్లు పోటీపడాలి
. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన
. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశా నిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: అభివృద్ధి సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్ప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ప్రభుత్వంపై నమ్మకంతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. రోజుకో ఒప్పందం… వారానికో శంకుస్థాపన జరుగుతున్నాయన్నారు. అత్యంత వేగవంతమైన పాలన, అభివృద్ధే మనందరి లక్ష్యం కావాలని, ఇందుకోసం గ్రామ స్థాయి ఉద్యోగుల వరకు చైతన్యపరిచే బాధ్యతను జిల్లా కలెక్టర్లే తీసుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఐదో బ్లాకులో రెండు రోజుల పాటు జరిగే 7 వ కలెక్టర్ల సదస్సు గురువారం ప్రారంభమయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘గత పాలకుల నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్ప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయి. రూ.1.30 లక్షల కోట్ల బిల్లులు కూడా గత పాలకులు మనపై రుద్దారు. అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కి… వ్యవస్థలను గాడిలో పెట్టగలిగాం. ప్రజా ప్రతినిధులు-అధికారుల కలయికే ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. ఇప్ప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నాం. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నాం. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో బాగా పని చేసిన చోట ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మంత్రుల నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి, ఉద్యోగి వరకూ అంతా బాధ్యతగా ఉండాలి. వచ్చిన ఫిర్యాదులు వంద శాతం పరిష్కరించాలి. ఆర్థికేతర ఫిర్యాదులను పరిష్కరించకుండా కొందరు పైకి కిందకు ఫైళ్లు తిప్ప్పుతున్నారు. వాటిని తక్షణం పరిష్కరించాలి. ఆర్థికపరమైన ఫిర్యాదుల గురించి కూడా విచారణ చేసి సరైన వాటిని పరిష్కరించాలి. 2027 మార్చి నాటికల్లా రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సమస్య పరిష్కారం కోసం వినూత్నంగా ఆలోచనలు చేస్తే సుపరిపాలన అందించినట్టే. డబ్బులు లేవనడం కాదు… సంపద సృష్టికి పని చేయాలి. అభివృద్ధి లేకుండా సంపద లేదు. సంపద లేకుండా సంక్షేమం లేదు. ఇదంతా ఒక సైకిల్ లాంటిదని సీఎం పేర్కొన్నారు.
కలెక్టర్ల సదస్సు క్వార్టర్లీ పరీక్షల్లాంటివి
‘గత ప్రభుత్వం అనవసరంగా ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో పెట్టేసింది. కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్న పరిస్థితి ఉంది. భూముల విషయంలో జీరో ఎర్రర్ రికార్డులు తయారు చేయాలి. రోడ్లు, వంతెనలు, ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి. ప్రతి మÖడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలు లాంటివి. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి టాపర్ల ఫోటోలతో యాడ్ ఇచ్చాం. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చాటి చెప్పాం. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ దిశగా అడుగులు వేస్తున్నాం. అన్ని రంగాల్లో… అన్ని వ్యవస్థల్లో ఏపీ పని తీరు బెంచ్ మార్క్ గా మారాలి. జిల్లాలు, కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి. జిల్లాల్లో అమలు చేసే ఉత్తమ పద్ధతులను బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా జిల్లాల్లోనూ అమలు చేస్తాం. ఆ కలెక్టర్లనే వాటికి నోడల్ ఆఫీసర్లుగా పెడతాం. ప్రజా సమస్యల అవగాహన కోసం అధికారులంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సామాజిక మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలి. కాగితాలపై లెక్కలు కాకుండా ఆచరణలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న మార్పు ప్రజల్లో కనిపించేలా మన పని విధానం ఉండాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు.
సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం
సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, నేను అని కాకుండా… మనం అనే ఆలోచనా విధానం అందరిలో రావాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నుంచి తాను కూడా నేను అనే పదాన్ని పక్కన పెట్టి మనం అనే పదాన్ని ఉపయోగిస్తానని సీఎం వెల్లడించారు. జీఎస్డీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్డీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు శిక్షణ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయి. సింగపూర్ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్ గా అభివృద్ధి చేద్దాం. సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పర్యవేక్షణ చేపట్టాలి. సింగపూర్ దేశంలో నేను కాదు… మనం అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా నేను కాదు మనం అనే విధానాన్నే అవలంభిద్దాం. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినా… సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నా… అందరి కృషి వల్లే సాధ్యమైంది. కలిసి కట్టుగా పని చేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా అభివృద్ధిలో దూసుకెళుతుందని సీఎం అన్నారు. ప్రారంభ ఉపన్యాసం అనంతరం ముఖ్యమంత్రి జిల్లాల వారీ జరుగుతున్న ప్రగతి, శాఖల వారీ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో జరుగుతున్న పని తీరు లోటుపాట్లపై సీఎం మార్గనిర్దేశనం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు