హైదరాబాద్: నేను చేసే సినిమాల్లో కథే హీరో అవుతుందని ప్రముఖ నటి సమంత అన్నారు. ఇటీవల జరిగిన ఓ మ్యాగజైన్ కవర్ షూటింగ్ సమయంలో సమంత తన పాత్రల ఎంపిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇకపై ఎలాంటి చిత్రాలలో నటించాలనేది…కథతో పాటు అందులోని పాత్రే నిర్ణయిస్తుందంటోంది. ‘కథ…నిర్మాత, నటీనటుల కంటే గొప్పది. సమాజంలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్నాను. సినిమాలు చూస్తున్న మహిళలు వాటిలోని పాత్రలతో మమేకమవ్వగలగాలి. తమను కూడా గుర్తించారని వారు భావించేలా అవి ఉండాలి. ఇకపై అలాంటి చిత్రాల్లోనే భాగం కావాలనుకుంటున్నాను’ అని చెప్పింది. కామెడీ, యాక్షన్ తరహాలో నేను వేరు వేరు చిత్రాలలో చేశాను కానీ, రెండు ఒకేసారి చేయలేదన్నారు. సాధారణంగా ఒక సినిమాలో నాయిక ప్రధాన పాత్రలో నటించినప్ప్పుడు దానికి ఎప్ప్పుడూ కొంత సామాజిక కోణం జోడించి ఉంటుందని, అది సినిమాను గంభీరంగా చేస్తుందన్నారు. మేము సాధారణ భావనలకు దూరంగా ఉండి ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని అత్యంత వినోదాత్మకంగా, కుటుంబం మొత్తం ఆస్వాదించేలా తీర్చిదిద్దాం అని తెలిపింది. సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సమంతతో పాటు దిగంత మంచాలే, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ఓ బేబి’ సినిమా సూపర్ హిట్ అయింది.
నా సినిమాలకు కథే హీరో: సమంత
- Advertisement -
RELATED ARTICLES


