ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం – ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదరం క్యాంపులను సజావుగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్, డాక్టర్ ముక్తియార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా 24 మంది సదరం క్యాంపులకు రావడం జరిగిందని, వారికి అన్ని విధాల వైద్య చికిత్సలను అందించి, శరీర భాగంలో ఏ అవయం ఎంత శాతం లేదో చికిత్సలు అందించామన్నారు. తదుపరి నివేదికలను తయారుచేసి జిల్లా అధికారులకు పంపడం జరిగిందన్నారు. సర్టిఫికెట్లు మూడు నెలల లోపు సచివాలయాలలో పంపిణీ చేస్తారని, తొలుత సంబంధిత రోగికి మెసేజ్ వెళుతుందని తెలిపారు.
సజావుగా సదరం క్యాంపులు
- Advertisement -
RELATED ARTICLES


