Homeజాతీయంకేరళం సీఎంగా వి.డి.సతీశన్

కేరళం సీఎంగా వి.డి.సతీశన్

- Advertisement -

కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. గురువారం న్యూఢిల్లీలో సీఎంగా సతీశన్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. కేరళం ముఖ్యమంత్రి పదవి రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కేరళంలోని పార్టీ కేడర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వి.డి.సతీశన్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

చివరగా సతీశన్ ఎంపిక..

ఏప్రిల్‌లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ జాబితాలో కేరళం అసెంబ్లీ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో కేరళం ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్‌ (యూడీఎఫ్)కు 102 స్థానాలు కట్టబెట్టాడు. దీంతో పదేళ్ల ఎల్‌డీఎఫ్ పాలనకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై తీవ్ర పోటీ నెలకొంది. దాంతో పార్టీ అధిష్ఠానం కేరళలోని కాంగ్రెస్ నేతలతో వరుసగా సంప్రదింపులు జరిపి చివరకు వి.డి.సతీశన్‌ను ఎంపిక చేసింది.

ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళంలోని కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సతీశన్ వైపు మొగ్గు చూపింది. దీంతో మే 4వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు పది రోజులకు కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక జరిగింది.

వి.డి. సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964, మే 31వ తేదీన ఆయన జన్మించారు. 2001 నుండి పారావూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కేరళ ప్రతిపక్ష నేతగా సతీశన్ ఉన్నారు. ఇప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు