Homeజిల్లాలుశ్రీ సత్యసాయినూతన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ గా కె రమేష్ బాబు పదవీ బాధ్యతలు స్వీకరణ

నూతన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ గా కె రమేష్ బాబు పదవీ బాధ్యతలు స్వీకరణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : నూతన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ గా కె. రమేష్ బాబు బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు అనంతపురం నుంచి బదిలీగా ధర్మవరం కు రావడం జరిగింది. గతంలో ఉన్న శశిధర్ అనంతపురంకు బదిలీ అయ్యారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ బ్యాంకు కస్టమర్లకు అన్ని విధాల తన సహాయ సహకారాలను అందిస్తానని, వారి అభివృద్ధి బాటే మా లక్ష్యము అని తెలిపారు. బ్యాంకు కస్టమర్లకు ఎటువంటి సమస్యలు ఎదురైనను తాను పరిష్కరిస్తానని తెలిపారు. అదేవిధంగా ఎస్బిఐ బ్యాంకు ఎన్నో రకాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తోందని తెలిపారు. ఆ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు