Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదివ్యాంగుల వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

దివ్యాంగుల వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

- Advertisement -

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.అర్చన
విశాలాంధ్ర ధర్మవరం;;అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని దివ్యాంగ విద్యార్థుల (3వ తరగతి నుండి డిగ్రీ వరకు) కోసం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలుర వసతి గృహం హెచ్ ఎల్ సి కాలనీ, అనంతపురం (సామర్థ్యం: 100 మంది).బాలికల వసతి గృహం అరవింద నగర్, అనంతపురం (సామర్థ్యం 50 మంది).అర్హత శారీరక, బధిర ,అంధత్వ వైకల్యం కలిగిన విద్యార్థులు.ఉచిత వసతి, భోజనం, దుస్తులు, నోట్ పుస్తకాలు , ఇతర నిత్యావసర వస్తువులు అందించబడతాయి అని తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకొని తమ విద్యను అభివృద్ధి చేసుకోవలసినదిగా వారు కోరారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 7893577797, 9492760438 లేదా కార్యాలయ పనివేళల్లో 08554-232380 నంబర్‌ను సంప్రదించగలరు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు