Thursday, January 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలకు ఆహ్వానం

సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలకు ఆహ్వానం

శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో వెలిసిన శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో ఈనెల 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆలయ ఆవరణములో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవాసమితి అధ్యక్షులు వీరనారాయణ, కార్యదర్శి రామలింగయ్య, ఉపాధ్యక్షులు టిసి. నారాయణరెడ్డి, కోశాధికారి సూర్యనారాయణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ముత్యాల ముగ్గుల పోటీలు ఉదయం 10 గంటలకు సాంప్రదాయ పద్ధతిలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల మహిళలు ఈనెల తొమ్మిదవ తేదీలోగా తమ పేర్లను ఆలయంలో వచ్చి నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కమిటీ వారు తెలియజేశారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 8297621055కు గాని ల్యాండ్ ఫోన్ నెంబర్ 08559-352668 కు సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు