Homeఆంధ్రప్రదేశ్ఇంధన పొదుపు…నాయకుల్లో కుదుపు

ఇంధన పొదుపు…నాయకుల్లో కుదుపు

- Advertisement -

సైకిళ్లపై ప్రయాణం సాగిస్తున్న ప్రజాప్రతినిదులు
విశాలాంధ్ర`విజయవాడ:
ప్రధాని మోదీ పొదుపు మంత్రంతో నాయకుల్లో కుదుపు మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ కాన్వాయ్‌లు కుదించుకున్నారు. ప్రతి శుక్రవారం ‘నాన్ వెహికల’డే గా ప్రభుత్వం ప్రకటించింది. దీనితో ప్రజాప్రతినిధుల్లోనూ చలనం వచ్చింది. మంత్రి రవీంద్ర టీడీపీ కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లారు. తన నియోజకవర్గంలో పర్యటించిన ఆయన రైతు బజార్‌కు సైకిల్‌నే వాడారు. అక్కడ ప్రజలతో కొంత సేపు మాట్లాడారు. ఆర్‌టీసీ బస్‌స్టాండ్‌కి వెళ్లి ప్రయాణికులతో ముచ్చటించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శుక్రవారం నియోజకవర్గంలో సైకిల్‌పై పర్యటించారు. నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాýకు సైకిల్‌పై వెళ్లారు.
మార్పు మంచిదే…ఎంతవరకో!
ఈ మార్పు మంచిదేనని ప్రజలు, విద్యావంతులు, విజ్ఞులు అనుకుంటున్నారు. ఇది సామాన్యుల్లో ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు. కానీ…ఎంత వరకు ఉంటుందనేది చెప్పలేం అని సందేహం వెలిబుచ్చుతున్నారు. ప్రచారం కోసమే ఇలా చేస్త్నున్నారు, ఒక రోజు అలా వెళితే సరిపోతుందా…ప్రతి రోజూ ఇలా సైకిల్‌పై తిరిగితే మరింత ఆదర్శవంతంగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. అలా చేస్తే ప్రజý ఆలోచనల్లో మార్పు వచ్చి వారు ఆచరించడానికి ప్రయత్నిస్తారని అంటున్నారు. లేదంటే ప్రచార ఆర్భాటంగానే మిగులుతుందని పెదవి విరుస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు