Homeజాతీయంలంచ్ బాక్స్‌తో సచివాలయానికి..

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి..

- Advertisement -

సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్
సమయానికి ముందే సచివాలయానికి
విజయ్ పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి పావుగంట ముందే చెన్నైలోని సెయింట్ జార్జ్ కోటలో ఉన్న సచివాలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచి స్వయంగా లంచ్ బాక్స్ తెచ్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. భోజన విరామ సమయంలో కూడా తన ఛాంబర్‌కే పరిమితమై, భోజనం ముగించి వెంటనే తిరిగి విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ కొత్త పనిశైలి సచివాలయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం్ణ (TVఖ) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా విజయ్ పనిచేస్తున్నారు. దీని కోసం అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమీకరించాలనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, కీలకమైన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన పనిలో చూపుతున్న వేగం, నిబద్ధత అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు