Homeజిల్లాలువిజయనగరంతహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ భారీ ర్యాలీ

తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ భారీ ర్యాలీ

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఆధ్వర్యంలో రాజాంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో నినాదాలతో ముందుకు సాగిన కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. తలే రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రైతులు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పరిశీలకులు పులిరాజు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు