భారత్‌కు వస్తున్న ఓ చమురు ట్యాంకర్ కీలకమైన హర్మూజ్ జలసంధిని శుక్రవారం (29న) సురక్షితంగా దాటింది. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు ఊపందుకోవడంతో ఈ కీలక సముద్ర మార్గంలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనడానికి ఈ పరిణామం ఓ సంకేతంగా నిలుస్తోంది. ప్రాంతీయ ఘర్షణల కారణంగా గత కొన్ని నెలలుగా ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పర్షియన్ గల్ఫ్‌లో దాదాపు 2,000 నౌకలు నిలిచిపోయాయి. ప్రపంచంలోని ఐదో వంతు చమురు, గ్యాస్ రవాణా జరిగే హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ, నౌకలపై దాడులతో ఫిబ్రవరినుంచి ఇక్కడ సంక్షోభం కొనసాగుతోంది. మొత్తం అవసరాల్లో 85 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకునే భారత్‌పై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపింది. అయితే, ఇటీవలి వారాల్లో ఃసర్వ శక్తిః సహా మరికొన్ని భారత ట్యాంకర్లు ఈ మార్గాన్ని విజయవంతంగా దాటాయి. తాజా పరిణామంతో దేశీయ ఇంధన నిల్వలకు, ముఖ్యంగా వేసవిలో గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ సరఫరాకు మరింత ఊరట లభించనుంది.ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య చర్చలు పురోగతిలో ఉన్నాయని, మరో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపునకు ఇరు దేశాలు దగ్గరగా ఉన్నాయని సమాచారం. ఈ మార్గం పూర్తిగా తెరుచుకుంటే ప్రపంచ చమురు ధరలు స్థిరపడతాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇటీవల పేర్కొన్నారు.
హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారత చమురు ట్యాంకర్
- Advertisement -
RELATED ARTICLES


